1 of 1807 families
Ravi Prakash
1 style ప్రతి వ్యక్తికిని అభిప్రాయస్వాతంత్ర్యమునకును, భావ ప్రకటన స్వాతంత్ర్యమునకును, హక్కు గలదు. పరుల జోక్యము లేక, స్వాభిప్రాయమును గలిగియుండుటకు స్వాతంత్ర్యమును, రాజ్యసీమానిరపేక్షముగా, నెట్టి మధ్యస్థ మార్గముననైన సమాచార, సంసూచనలను అన్వేషించుటకు, పొందుటకు, ఉపపాదించుటకు, స్వాతంత్ర్యమును ఈ హక్కులో నిమిదియున్నవి.
సంఘమునందలి సభ్యుడుగా, ప్రతి వ్యక్తికిని సామాజిక రక్షకు హక్కు గలదు. రాష్ట్రీయ ప్రయత్న, అంతర్ రాష్ట్రీయ సహకారముల ద్వారా, ప్రతి రాజ్యముయొక్కయు వ్యవస్థాపనా సాధన సామగ్రి ననుసరించి, తన ప్రతిపత్తికిని తన వ్యక్తిత్వముయొక్క స్వేచ్ఛాభివృద్ధికిని అత్యావశ్యకములయిన, ఆర్థిక , సాంఘిక, సాంస్కృతిక స్వత్వముల సంపాదనకు అతనికి అధికారము గలదు.
పని కాలము యొక్క యుక్తపరిమితత్వమునకును, వేతన సహితములగు నియతకాలికములయిన సెలవు దినములకును, విశ్రాంతి విరామములకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.
ఈ ప్రకటన యందు పొందుపరుపబడియున్న స్వత్వ స్వాతంత్ర్యములు సంపూర్ణముగా సిద్ధింపగల ఒక సాంఘిక అంతర్ రాష్ట్రీయవ్యవస్థకు, ప్రతి వ్యక్తికి నధికారము గలదు.